రామయ్యకు స్వర్ణపుష్పార్చన | ramayyaku swrna pushparchna | Sakshi
Sakshi News home page

రామయ్యకు స్వర్ణపుష్పార్చన

Jul 25 2016 12:13 AM | Updated on Sep 4 2017 6:04 AM

స్వామి వారికి నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు,

స్వామి వారికి నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు,

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి ఆదివారం వైభవంగా స్వర్ణ పుష్పార్చన చేశారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి ఆదివారం వైభవంగా స్వర్ణ పుష్పార్చన చేశారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకుని వచ్చి అంతరాలయంలో అభిషేకం చేశారు. అనంతరం 108 స్వర్ణ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి స్వామి వారి నిత్యకల్యాణ మూర్తులను పల్లకీలో ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆలయ బేడా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వర్ణ సింహాసనంపై కూర్చుండబెట్టారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం చేశారు. అర్చకులు స్వామి, అమ్మవారి వంశక్రమాన్ని, ఆలయ విశిష్టతను భక్తులకు తెలిపారు. వేద పండితులు వేద విన్నపాలు చేశారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం రామయ్యకు అత్యంత వైభవోపేతంగా నిత్యకల్యాణం నిర్వహించారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement