పంటకుంటలకు ప్రాధాన్యమివ్వండి | preference to pantakuntalu | Sakshi
Sakshi News home page

పంటకుంటలకు ప్రాధాన్యమివ్వండి

May 20 2017 11:54 PM | Updated on Sep 5 2017 11:36 AM

పంటకుంటలకు ప్రాధాన్యమివ్వండి

పంటకుంటలకు ప్రాధాన్యమివ్వండి

కొవ్వూరు రూరల్‌ : రైతులు పొలాల్లో పంట కుంటలు తవ్వేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ ఆదేశించారు.

కొవ్వూరు రూరల్‌ : రైతులు పొలాల్లో పంట కుంటలు తవ్వేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ ఆదేశించారు. శనివారం కొవ్వూరులోని మంత్రి కార్యాలయంలో ఇంకుడు గుంతలు, పంటకుంటలపై మండల పరిషత్, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి తీర ప్రాంతంలో ఉన్నప్పటికీ చాగల్లు మండలంలోని 
మల్లవరం, చిక్కాల గ్రామాల్లో భూగర్భజలాలు అతి తక్కువగా ఉన్నాయన్నారు. నీరు–ప్రగతి కార్యక్రమంలో చెరువుల పూడికతీత, కాలువల ఆధునికీకరణ, ఇంకుడుగుంతలు, ఫామ్‌పాండ్‌ల తవ్వకం ద్వారా భూగర్భ జలాలలను పెంపొందించుకోవచ్చన్నారు. దీనికి సంబంధించి గ్రామాల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కొవ్వూరు, తాళ్లపూడి తహసీల్దార్‌లు కె.విజయకుమార్, శ్రీనివాసరావు, ఎంపీడీవోలు ఎ.రాము, కె.పురుషోత్తమరావు, జ్యోతిర్మయి పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement