అనంతపురంలోని ప్రకాశ్ రోడ్డులో గల ఓ ఇంటిలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టూటౌన్ ఎస్‌ఐ శివగంగాధర్‌రెడ్డి తమ సిబ్బందితో కలసి గురువారం రాత్రి దాడులు చేశారు.
అనంతపురం సెంట్రల్ : అనంతపురంలోని ప్రకాశ్ రోడ్డులో గల ఓ ఇంటిలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టూటౌన్ ఎస్‌ఐ శివగంగాధర్‌రెడ్డి తమ సిబ్బందితో కలసి గురువారం రాత్రి దాడులు చేశారు. మొత్తం పది మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.16 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఆరు బైక్‌లు, పది సెల్‌ఫోన్లు సీజ్ చేసినట్లు చెప్పారు. ఆర్‌ఎస్‌ఐ వలి, సిబ్బంది, స్పెషల్‌పార్టీ పోలీసులు పాల్గొన్నారు.