పెద్ద నోటు చెల్లదనడంతో వృద్ధుడు మృతి | old mand died with efftct of big note | Sakshi
Sakshi News home page

పెద్ద నోటు చెల్లదనడంతో వృద్ధుడు మృతి

Nov 17 2016 10:36 PM | Updated on Jul 6 2019 12:36 PM

పెద్ద నోటు చెల్లదనడంతో వృద్ధుడు మృతి - Sakshi

పెద్ద నోటు చెల్లదనడంతో వృద్ధుడు మృతి

తన వద్ద ఉన్న వెయ్యి రూపాయల పాతనోటు చెల్లదని తెలుసుకుని షాక్‌కు గురై ఓ వృద్ధుడి గురువారం మృతిచెందాడు.

వెల్దుర్తి రూరల్‌: తన వద్ద ఉన్న వెయ్యి రూపాయల పాతనోటు చెల్లదని తెలుసుకుని షాక్‌కు గురై ఓ వృద్ధుడి గురువారం మృతిచెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి పట్టణానికి చెందిన ఇదురు బాషా(80)కి ప్రతినెలా వృధ్యాప్య పింఛన్‌ వస్తుంది. íపింఛన్‌ డబ్బులో తాను దాచుకున్న వెయ్యి రూపాయల నోటుతో వస్తువుల కొనుగోలు నిమిత్తం బుధవారం గ్రామంలో పలుచోట్లకు వెళ్లగా చెల్లదని చెప్పారు. దీంతో అతను షాక్‌కు గురై పట్టణంలోని జామియామజీదు ప్రాంతంలో కూలబడిపోయాడు. గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబసభ్యులకు విషయం తెలుపగా హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అతను కోమాలోకి వెళ్లాడని తెలుసుకున్న డాక్టర్లు ఐసీయూలో వెంటిలేటర్లపై ఉంచారు. చికిత్స పొందుతూ గురువారం వృద్ధుడు మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement