
రెండేళ్లల్లో చేసిందేమీ లేదు
టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండేళ్లల్లో ప్రజలకు చేసిం దేమీ లేదని, మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై
ప్రభుత్వ విధానాలపై ఉద్యమిస్తాం: పొన్నం
కరీంనగర్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండేళ్లల్లో ప్రజలకు చేసిం దేమీ లేదని, మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై క్షేత్రస్థాయిలో ఉద్యమిస్తామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆయన కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు గడపదాటడం లేదని ఆరోపించారు. ఎన్నికల ముం దు ప్రజలకిచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని, రుణమాఫీకి స్పష్టత లేకుండా పోయిందని, డబుల్‌బెడ్‌రూం పథకం అటకెక్కిందని, కేజీ టూ పీజీ గందరగోళంగా మారిందని, మూడెకరాల భూపంపిణీ పథకం నత్తనడకన సాగుతోందని దుయ్యబట్టారు. అణచివేత చర్యలకు దిగడం, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం లాంటి దుర్మార్గపు పనులు తప్ప కేసీఆర్ ప్రజలకు చేసిందేమి లేదని పొన్నం ఆరోపించారు.