ఎమ్మెల్యే జేసీని అరెస్ట్‌ చేయాలి | MLA JC should be arrested | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే జేసీని అరెస్ట్‌ చేయాలి

Mar 6 2017 10:13 PM | Updated on Nov 6 2018 5:13 PM

ఎమ్మెల్యే జేసీని అరెస్ట్‌ చేయాలి - Sakshi

ఎమ్మెల్యే జేసీని అరెస్ట్‌ చేయాలి

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని వెంటనే అరెస్ట్‌ చేయాలని వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష నేత , వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రతిష్ట దిగజార్చే విధంగా వ్యవహరించిన జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎస్కేయూలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

వర్సిటీలో కొనసాగుతున్న ఆందోళనలు 
 
ఎస్కేయూ :  తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని వెంటనే అరెస్ట్‌ చేయాలని వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష నేత , వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రతిష్ట దిగజార్చే విధంగా వ్యవహరించిన జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎస్కేయూలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో సోమవారం జేసీ ప్రభాకర్‌రెడ్డి దిష్టిబొమ్మను శవయాత్ర చేసి నిరసన తెలిపారు. వైఎస్సార్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు మాట్లాడుతూ... ప్రజాప్రతినిధిగా ఉంటూ .. తన స్థాయిని మరచి   వ్యవహరించిన జేసీ ఎమ్మెల్యే పదవికి అనర్హుడని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజాభ్యుదయానికి పాటుపడుతున్న ప్రతిపక్ష నేతపై అసభ్యపదజాలం ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జీవీ లింగారెడ్డి, నరేంద్రరెడ్డి , ఎస్కేయూ అధ్యక్షుడు వై.భానుప్రకాష్‌రెడ్డి,  నాయకులు అమర్‌నాథ్, రాంబాబు, ఛార్లెస్‌ ,జయచంద్రా రెడ్డి, హేమంత్‌ కుమార్, శ్రీనివాసులు, గంగాధర్, తిమ్మరాజు, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
             
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement