వెబ్‌సైట్‌లో వైద్య సిబ్బంది మెరిట్‌ జాబితా | Merit list of the medical staff of the website | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్‌లో వైద్య సిబ్బంది మెరిట్‌ జాబితా

Jul 24 2016 10:13 PM | Updated on Sep 4 2017 6:04 AM

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో రాష్ట్రీయ బాల స్వస్తయ కార్యక్రమంలో సంచార ఆరోగ్య బృందాలలో కాంట్రాక్టు పద్ధతిపై పని చేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించిన మెరిట్‌ జాబితా www.kadapa.nic.in అనే వెబ్‌సైట్‌లోవెబ్‌సైట్‌లో పొందుపరిచామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి తెలిపారు

కడప కోటిరెడ్డి సర్కిల్‌ :

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో రాష్ట్రీయ బాల స్వస్తయ కార్యక్రమంలో సంచార ఆరోగ్య బృందాలలో కాంట్రాక్టు పద్ధతిపై పని చేసేందుకు మెడికల్‌ ఆఫీసర్స్‌ (స్త్రీ, పు), మెడికల్‌ ఆఫీసర్స్‌ ఆయుష్‌ (స్త్రీ, పు), ఫార్మసిస్టులు, ఏఎన్‌ఎం పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించిన మెరిట్‌ జాబితా  www.kadapa.nic.in అనే వెబ్‌సైట్‌లో పొందుపరిచామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సత్యనారాయణరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మెరిట్‌ జాబితా అభ్యర్థుల సౌలభ్యం కోసం కడప నూతన కలెక్టరేట్, డీఎంహెచ్‌ఓ కార్యాలయాలతోపాటు జిల్లాలోని కడప, రాజంపేట, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులో ఉంచామని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్‌ జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 28వ తేది సాయంత్రం 5 గంటల్లోగా రాత పూర్వకంగా డీఎంహెచ్‌ఓ దృష్టికి తీసుకు రావాలని ఆయన కోరారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement