పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య | Married to commit suicide by drinking pesticide | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

Dec 10 2016 2:34 AM | Updated on Aug 29 2018 8:24 PM

పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని చల్మెడ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.

చల్మెడ (మునుగోడు) : పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని చల్మెడ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుండెబోయిన పాపయ్య -లింగమ్మల కూమారుడు మల్లేష్‌కు రెండేళ్ల క్రితం నల్లగొండ మండలం అప్పాజిపేటకు చెందిన ముంజుల( 26)ను ఇచ్చి వివాహం చేశారు. ఆ దంపతులకు ఏడాది క్రితం బాలుడు జన్మించాడు. కొద్ది నెలల పాటు సాపీగా సాగిన వారి జీవితంలో కుటుంబ కలహాలు మొదలయ్యారుు. వ్యవసాయ పని చేయడం లేదని, తమతో కలిసి పనిచేయాలని తరుచూ అత్తమామలు ఆమెపై తగువు పడేవారు. వారికి తోడు భర్త కూడా ఆమెతో గొడవ పడడంతో మనస్తాపానికి గురై శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వైద్య కోసం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. 
 
 భర్త, అత్తమామలపై దాడికి యత్నం
 తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని భర్త, అత్త, మా మలే కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి కుటుంబ సభ్యులు భర్త, అత్త, మామలపై దాడికి యత్నించారు. ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఎలాంటి తగువు జరుగకుండా అడ్డుకున్నారు. అనంతరం చండూరు సీఐ రమేష్‌కుమా ర్, ఎస్‌ఐ అహ్మద్‌లు ఇరువురి కుటుంబ సభ్యులతో మాట్లాడి శాంతింపజేశారు. మృతిరాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండకు తరలించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement