కర్నూలు వ్యవసాయ మార్కెట్ పరిధిలో పది రోజులుగా స్తంభించిన వ్యవసాయ ఉత్పత్తుల క్రయ, విక్రయాలు బుధవారం ప్రారంభమయ్యాయి.
కర్నూలు మార్కెట్‌లో విక్రయాలు ప్రారంభం
Nov 24 2016 12:08 AM | Updated on Jun 4 2019 5:04 PM
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ పరిధిలో పది రోజులుగా స్తంభించిన వ్యవసాయ ఉత్పత్తుల క్రయ, విక్రయాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉల్లితోపాటు వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న తదితర పంట ఉత్పత్తులు భారీ స్థాయిలో మార్కెట్ వచ్చాయి. ఎట్టకేలకు మార్కెట్‌లో లావాదేవీలు ప్రారంభం కావడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. నగదు కొరతతో రైతులకు పేమెంట్‌ను చెక్‌ల రూపంలో చెల్లించారు.
Advertisement
Advertisement