చంద్రబాబుకు భద్రత మరింత పెంపు | Maoists threaten to kill CM chandrababu, his security extended | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు మరింత భద్రత

Oct 29 2016 1:41 PM | Updated on Mar 28 2019 5:07 PM

చంద్రబాబుకు భద్రత మరింత పెంపు - Sakshi

చంద్రబాబుకు భద్రత మరింత పెంపు

ఏవోబీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

విజయవాడ: ఏవోబీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో చంద్రబాబుపై ఆత్మాహుతి దాడులకు పాల్పడుతామంటూ మావోయిస్టులు  బెదిరింపులతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీంతో చంద్రబాబుకు భద్రతగా కమాండోల సంఖ్యను మరింత పెంచారు. ఉండవల్లిలోని నివాసంతో పాటు, విజయవాడలోని సీఎం కార్యాలయంలో భద్రత పెంపుతో పాటు ముఖ్యమంత్రి పర్యటనపైనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. అలాగే ముఖ్యమంత్రిని కలిసే వ్యక్తులపై నియంత్రణతో పాటు, సామన్యులకు అపాయింట్మెంట్లను రద్దు చేసినట్లు సమాచారం.

మరోవైపు భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉండటంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.  ప్రజాప్రతినిధులు మావోయిస్టు ప్రభావిత ప్రాంత గ్రామాల్లో పర్యటించేటప్పుడు తమకు సమాచారం ఇవ్వడంతో పాటు, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. కాగా ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో 30మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement