'మన్మోహన్ ఐదేళ్లంటే.. వెంకయ్య పదేళ్లన్నాడు' | killi kriparani statement on special status | Sakshi
Sakshi News home page

'మన్మోహన్ ఐదేళ్లంటే.. వెంకయ్య పదేళ్లన్నాడు'

Aug 19 2015 8:08 PM | Updated on Jul 29 2019 5:43 PM

'మన్మోహన్ ఐదేళ్లంటే.. వెంకయ్య పదేళ్లన్నాడు' - Sakshi

'మన్మోహన్ ఐదేళ్లంటే.. వెంకయ్య పదేళ్లన్నాడు'

విభజన సమయంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఐదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనున్నట్లు ప్రకటిస్తే దానికి నాటి ప్రతిపక్ష సభ్యుడు వెంకయ్యనాయుడు బీజేపీ అధికారంలోకి వస్తే పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తుందని ప్రకటించారని కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి గుర్తు చేశారు.

విజయవాడ: విభజన సమయంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఐదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనున్నట్లు ప్రకటిస్తే దానికి నాటి ప్రతిపక్ష సభ్యుడు వెంకయ్యనాయుడు బీజేపీ అధికారంలోకి వస్తే పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తుందని ప్రకటించారని కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి గుర్తు చేశారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై విద్యార్థి, యువజన సదస్సు విజయవాడలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో బుధవారం జరిగింది.

ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృపారాణి మాట్లాడుతూ.. ఇప్పుడు హోదా రావడానికి ఏపీకి అర్హత లేదని, చట్టబద్ధత లేదని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించడం సిగ్గుచేటని విమర్శించారు. అరవై ఏళ్లుగా తెలంగాణ కోరిక ప్రజల్లో ఉంది.. దానికి అనుగుణంగానే అన్ని పార్టీలు రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయి.. అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని కిల్లి కృపారాణి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement