పేదల మదిలో వైఎస్‌ పదిలం | Keeping in mind the poor YS | Sakshi
Sakshi News home page

పేదల మదిలో వైఎస్‌ పదిలం

Sep 3 2016 12:13 AM | Updated on Sep 4 2017 12:01 PM

పేదల మదిలో వైఎస్‌ పదిలం

పేదల మదిలో వైఎస్‌ పదిలం

పరకాల: పేద, మధ్య తరగతి వర్గాల మదిలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పదిలంగా ఉన్నారని, తన పాలన దక్షతతో ఆయా వర్గాల వారిని అందలం ఎక్కించారని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో శుక్రవారం మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాలాభిషేకం చేసి పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయిని మాట్లాడుతూ.. రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలు నేటికీ సజీవంగానే

  • సామాన్యులను అందలం ఎక్కించిన మహానేత
  • ఓట్లు పడవనే కుట్రతోనే విగ్రహాన్ని తొలగించారు
  • ఆవిష్కరణలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి
  • పరకాల: పేద, మధ్య తరగతి వర్గాల మదిలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పదిలంగా ఉన్నారని, తన పాలన దక్షతతో ఆయా వర్గాల వారిని అందలం ఎక్కించారని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో శుక్రవారం మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాలాభిషేకం చేసి పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయిని మాట్లాడుతూ.. రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలు నేటికీ సజీవంగానే ఉన్నాయన్నారు. పేదలు కార్పొరేట్‌ వైద్యం పొందుతున్నారని, ఆరోగ్య శ్రీ పథకంతో ప్రాణాలు నిలుపుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఓట్లు పడవనే భయంతోనే పరకాలలో వైఎస్‌ విగ్రహాన్ని తొలగించారని, మరో విగ్రహం ఏర్పాటు చేస్తామంటే అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని అన్నారు.
     
    ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూజారి సాంబయ్యగౌడ్‌ మాట్లాడుతూ.. వైఎస్‌ ప్రవేశపెట్టిన పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందని అన్నారు. ఆయన భౌతికంగా లేకున్నా ప్రజ ల హృదయాల్లో నిలిచి ఉన్నారన్నారు. కుట్ర చేసి విగ్రహాన్ని తొ లగించడం సరికాదన్నారు. వై ఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నా డెం శాంతికుమార్‌ మాట్లాడుతూ వైఎస్‌  విగ్రహాన్ని తొలగించిన దుండగులను ఇప్పటికీ గుర్తించకపోవడం దారుణమన్నారు.  పరకాల పీఏసీఎస్‌ చైర్మన్‌ కట్కూరి దేవేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి, ఈవీ శ్రీనివాస్, ఆత్మకూరు జడ్పీటీసీ లేతాకుల సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి బొచ్చు కృష్ణారావు, కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ మడికొండ సంపత్‌కుమార్, జక్క జడ్సన్, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్, మండల అధ్యక్షులు బొచ్చు భాస్కర్, ఓడీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ గోల్కొండ సదానందం, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు పోశాల పద్మ, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 
    రాజన్న హయాంలోనే రామరాజ్యం 
    కాజీపేట రూరల్‌ : హన్మకొండలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్‌ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్‌ వైఎస్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రామరాజ్యాన్ని  తలపించే లా వైఎస్‌ పాలన అందించారని, తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా పలు ప్రాజెక్టులు నిర్మిం చారని అన్నారు. ప్రజాబాంధవుడిగా చరిత్రలో నిలిచిన మహానేత అని కొనియాడారు.
     
    కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంగాల ఈర్మియా, యువజన విభాగం అధ్యక్షుడు అప్పం కిషన్,  ప్రధాన కార్యదర్శి దోపతి సుదర్శన్‌రెడ్డి, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు వెంకన్న, మహిళా అధ్యక్షురాలు బీంరెడ్డి స్వప్న, నాయకులు చంద హరి కృష్ణ, కళ్యాణ్, చరణ్, సంతోష్, నర్సన్న, బొచ్చు రవి, రాజేష్‌ రెడ్డి, సుమిత్‌ గుప్తా, రజినికాంత్, మంచే అశోక్, నెమలిపురి రఘు, రవితేజరెడ్డి, పసునూరి ప్రభాకర్, సతీష్, నాని పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement