కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టారేణుక సహకారంతో కోడుమూరులో జనపనార బ్యాగుల తయారీ కేంద్రం మంజూరైందని జాతీయ జనపనార బోర్డు కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు.
కోడుమూరులో జపనార బ్యాగుల తయారీ కేంద్రం
Jan 11 2017 12:35 AM | Updated on Oct 9 2018 4:06 PM
కోడుమూరు రూరల్: కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టారేణుక సహకారంతో కోడుమూరులో జనపనార బ్యాగుల తయారీ కేంద్రం మంజూరైందని జాతీయ జనపనార బోర్డు కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. కోడుమూరులో మంగళవారం మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 25మందికి 40రోజుల పాటు బ్యాగుల తయారీపై శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణలో పాల్గొనదలచిన వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ అనంతరం బ్యాగుల తయారీకి అవసరమయ్యే కుటీర పరిశ్రమల ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా అవసరమైన లింకేజీ రుణాల సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సదస్సులో మాజీ సర్పంచ్ కేఈ.రాంబాబు, సీపీఎం రాజు, మల్లేష్, కృష్ణ, నీలంకృష్ణ, ఏకాంబరం, వెంకటేష్ తదితరులుపాల్గొన్నారు.
Advertisement
Advertisement