సంబరాలు కాదు..సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసి చూపాలని టీసీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వం సంబరాలు జరపటం కాదు..సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసి చూపాలని టీసీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. పథకాలకు అవసరమైనన్ని నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలకు నిధులు రూ.3,600 కోట్లు వెంటనే మంజూరు చేయాలని కోరారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రతిపక్షాలు 8 సీట్లు గెలుచుకుంటాయని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి..ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చి అన్ని సీట్లూ గెలుచుకోవాలని సవాల్ విసిరారు.