శిక్షణ అవసరాల గుర్తింపు పరీక్ష పేరుతో ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీవీ సుబ్బారావు ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : శిక్షణ అవసరాల గుర్తింపు పరీక్ష పేరుతో ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీవీ సుబ్బారావు ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు పలు పరీక్షలు ఉత్తీర్ణులై, వృత్తిపరమైన శిక్షణలు పొందుతూ తమ సామర్థ్యాలను పెంచుకుంటూ అంకిత భావంతో బోధిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందిస్తున్న తరుణంలో ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు, పీఈటీలకు నిర్వహించనున్న ఈ పరీక్షను తమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ప్రభుత్వం పరీక్ష నిర్వహణను విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు