పేదలు, ఆదివాసులు సాగు చేసుకుంటున్న పంట లను హరితహారం పేరుతో ధ్వంసం చేయడం తగదని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. ఈ మేరకు వరంగల్ చౌరస్తాలో న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు.
పంటలను ధ్వంసం చేయడం తగదు
Aug 9 2016 12:30 AM | Updated on Sep 4 2017 8:25 AM
వరంగల్ చౌరస్తా : పేదలు, ఆదివాసులు సాగు చేసుకుంటున్న పంట లను హరితహారం పేరుతో ధ్వంసం చేయడం తగదని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. ఈ మేరకు వరంగల్ చౌరస్తాలో న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ 2006 అటవీ హక్కు లచట్ట ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వకుండా.. ఉన్న భూముల్లో మొక్కలు నాటడమేమిటని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులకు 3 ఎకరాల భూ పంపిణీ చేస్తామని కేసీఆర్ ప్రకటించి, ఇప్పుడు భూములను లాక్కోవడం సరికాదన్నారు. నాయకులు చిర్ర సూరి, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పసునూటి రాజు, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పైండ్ల యాకయ్య, నాయకులు మైదం పాణి, మోహన్, కార్తీక్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు
Advertisement
Advertisement