
టీడీపీ పేరు మార్చితే ఎలా ఉంటుంది?
తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జాతీయ పార్టీ ఆవిర్భావంపై ఆసక్తికర చర్చ జరిగింది.
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జాతీయ పార్టీ ఆవిర్భావంపై ఆసక్తికర చర్చ జరిగింది. ప్రాంతీయ అభిమానం ఎక్కువగా ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో టీడీపీని అక్కడ ప్రజలు ఆదరిస్తారా? గతంలో ఎన్టీఆర్ టీడీపీని జాతీయ పార్టీగా మార్చాలని చూసి వెనక్కి తగ్గారని కొంతమంది నేతలు, పార్టీ పేరు మారిస్తే ఎలా ఉంటుందని మరి కొంతమంది నేతలు సూచించారు.
అయితే పార్టీ పేరు మార్చకుండానే ఆయా ప్రాంతాల్లో సమస్యలపై ముందుకు వెళితే పార్టీకి ఆదరణ ఉంటుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. టెక్నికల్గా సైకిల్ గుర్తు కూడా పార్టీకే వస్తుందని ఆయన చెప్పినట్లు సమాచారం. జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలు, నామినేటెడ్ పోస్టులు అసెంబ్లీ సమావేశాల తర్వాతే భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు ఈ సమావేశంలో పేర్కొన్నట్లు తెలుస్తుంది.