భార్య ఎడబాటుతో.. భర్త ఆత్మహత్య | Husband commits suicide worried about wife | Sakshi
Sakshi News home page

భార్య ఎడబాటుతో.. భర్త ఆత్మహత్య

Oct 28 2015 8:26 PM | Updated on Sep 3 2017 11:38 AM

భార్య ఎడబాటుతో.. భర్త ఆత్మహత్య

భార్య ఎడబాటుతో.. భర్త ఆత్మహత్య

భార్య ఎడబాటును జీర్ణించుకోలేని భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం పగిడ్యాల మండలం నెహ్రూనగర్ గ్రామంలో చోటుచేసుకుంది.

పగిడ్యాల(కర్నూలు జిల్లా): భార్య ఎడబాటును జీర్ణించుకోలేని భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం పగిడ్యాల మండలం నెహ్రూనగర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. నెహ్రూనగర్ గామానికి చెందిన రమేష్(32)కు మిడుతూరు గ్రామానికి చెందిన అరుణ అనే యువతితో నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. భార్యభర్తలు రెండేళ్లపాటు అన్యోన్యంగా సంసారం సాగించాక విభేదాలు తలెత్తాయి. పెద్దలతో పంచాయతీ నిర్వహించి రమేష్ భార్యను కాపురానికి పిలిపించుకున్నాడు.

అయితే మళ్లీ ఏడాది పాటు కాపురం చేసిన తర్వాత మనస్పర్ధలు తలెత్తడంతో భార్య అరుణ పుట్టింటికి వెళ్లిపోయింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని భర్త, అత్తమామలపై కేసు పెట్టింది. ఈ క్రమంలోనే ఒంటరిగా జీవించలేక మనోవేదనకు గురై బుధవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రమేష్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement