పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పనిచేస్తున్న హౌస్‌సర్జన్లు మంగళవారం ఉదయం నుంచి సమ్మె చేస్తున్నారు.
పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పనిచేస్తున్న హౌస్‌సర్జన్లు మంగళవారం ఉదయం నుంచి సమ్మె చేస్తున్నారు. తమకు వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాలని, కనీస వసతులు కల్పించాలని వారు డిమాండం చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా సాధారణ వైద్య సేవలకు హౌస్‌సర్జన్లు హాజరుకావడంలేదు. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకే తాము పనిచేస్తామని వారు స్పష్టంచేశారు.