ఫేస్‌బుక్, మిత్రులు, ఔదార్యం | helping hands facebook friends | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్, మిత్రులు, ఔదార్యం

Aug 8 2016 11:58 PM | Updated on Jul 26 2018 5:23 PM

ధర్మపురి :చిన్నవయసులోనే మధుమేహంతో బాధపడుతున్న పట్టణానికి చెందిన నాగరాజు నాగేశ్వరి (8)కి ఫేస్‌బుక్‌ మిత్రులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. బాలిక తల్లిదండ్రుల ధీనస్థితిని చూసిన ధర్మపురికి చెందిన రేణికుంట రమేశ్‌ ఆమె కథనాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా తన స్నేహితులకు పంపించారు. ఆ కథనాన్ని ధర్మపురిలో ఉంటున్న వారితోపాటు వివిధ దేశాల్లో ఉన్న ఫేస్‌బుక్‌ మిత్రులు చదివి చలించిపోయారు.

  • నాగేశ్వరి కుటుంబానికి రూ.2.3లక్షలు డిపాజట్‌
  • ధర్మపురి :చిన్నవయసులోనే మధుమేహంతో బాధపడుతున్న పట్టణానికి చెందిన నాగరాజు నాగేశ్వరి (8)కి ఫేస్‌బుక్‌ మిత్రులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. బాలిక తల్లిదండ్రుల ధీనస్థితిని చూసిన ధర్మపురికి చెందిన రేణికుంట రమేశ్‌ ఆమె కథనాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా తన స్నేహితులకు పంపించారు. ఆ కథనాన్ని ధర్మపురిలో ఉంటున్న వారితోపాటు వివిధ దేశాల్లో ఉన్న ఫేస్‌బుక్‌ మిత్రులు చదివి చలించిపోయారు. మిత్రులందరూ కలిసి రూ.2.3లక్షలు పోగుచేశారు. ఆ డబ్బును సోమవారం ధర్మపురిలోని ఎస్‌బీఐలో నాగేశ్వరి పేరిట ఖాతా తీసి డిపాజిట్‌ చేశారు. సంబంధిత బాండ్‌ను బ్యాంకు మేనేజర్‌ స్వరూపారాణి నాగేశ్వరి తల్లిదండ్రులకు అందించారు. ఈ సొమ్ముతో వచ్చిన వడ్డీని వైద్య ఖర్చులకు వినియోగించుకోవాలని మేనేజర్‌ సూచించారు. నాగేశ్వరికి ప్రతినెలా వైద్యపరీక్షలు చేయిస్తానని కరీంనగర్‌కు చెందిన శ్రీనిధి ఆస్పత్రి వైద్యుడు శ్రీనివాస్‌ ప్రకటించడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement