జానా అలా అన్నందుకే పార్టీ మారా: గుత్తా | Gutta comments on Jana | Sakshi
Sakshi News home page

జానా అలా అన్నందుకే పార్టీ మారా: గుత్తా

Jul 12 2016 2:46 AM | Updated on Sep 19 2019 8:44 PM

జానా అలా అన్నందుకే పార్టీ మారా: గుత్తా - Sakshi

జానా అలా అన్నందుకే పార్టీ మారా: గుత్తా

కోమటిరెడ్డి సోదరులు, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెట్టే బాధలు భరించలేకనే సీఎల్పీ నేత జానారెడ్డి రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని చెబుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

నల్లగొండ : కోమటిరెడ్డి సోదరులు, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెట్టే బాధలు భరించలేకనే సీఎల్పీ నేత జానారెడ్డి రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని చెబుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నల్లగొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జానారెడ్డి రాజకీయ సన్యాసం పుచ్చుకోవడం ఎందుకని చెప్పి తామే పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ నిలువునా మునిగిపోవడానికి పన్నెండు మంది నాయకులు కారకులని, వారిలో కొందరు మిర్యాలగూడలో జరిగిన సభలో కూడా పాల్గొన్నారని ఎంపీ తెలిపారు. రాష్ట్రానికి కాబోయే సీఎంలు తామేనని ప్రగల్భాలు పలికి చిట్టచివరికి పార్టీనే ముంచారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement