'కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్సే' | former mla jagga reddy slams kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్సే'

Jul 3 2016 7:44 PM | Updated on Aug 15 2018 9:35 PM

'కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్సే' - Sakshi

'కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్సే'

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్‌ పార్టీయే' అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

మెదక్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్‌ పార్టీయే' అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను నైతికంగా విమర్శించే హక్కు టీఆర్‌ఎస్‌ నేతలకు లేదని ఆయన అన్నారు. ఆదివారం మెదక్‌లో జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రజల వద్దకు పాలనే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని చెప్పారు.

స్థానిక ఎమ్మెల్యేకు ప్రజల సమస్యలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలోనే ప్రాజెక్టులు ఎక్కువ పూర్తైయ్యాయని గుర్తు చేశారు. ప్రజలను మభ్యపెట్టడానికి కేసీఆర్‌ కుటుంబం మాటల గారడీ చేస్తోందని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement