నల్లగొండ పట్టణంలోని లతీఫ్‌సాబ్ గుట్టపై ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
నల్లగొండ క్రైమ్: నల్లగొండ పట్టణంలోని లతీఫ్‌సాబ్ గుట్టపై ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 20 ఎకరాల్లో ఉన్న ఈ గుట్టపై చెట్లు ఉండగా... గుట్టకు రెండు వైపుల నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి.
రెండు అగ్నిమాపక శకటాలతో సిబ్బంది కింది నుంచే మంటలను ఆర్పివేసేందుకు చర్యలు ప్రారంభించారు. గుట్టపైకి వెళ్లే అవకాశం లేదు. ఎవరో సిగరెట్ తాగి పడవేయడమో లేక నిప్పు పెట్టడమే జరిగి ఉంటుందని భావిస్తున్నారు.