పుష్కర పనులు త్వరగా చేపట్టండి | Fastly complete pushkara works | Sakshi
Sakshi News home page

పుష్కర పనులు త్వరగా చేపట్టండి

Jul 19 2016 6:56 PM | Updated on Sep 4 2017 5:19 AM

పుష్కరఘాట్‌లను పరిశీలిస్తున్న అధికారులు

పుష్కరఘాట్‌లను పరిశీలిస్తున్న అధికారులు

మక్తల్‌ : కృష్ణా పుష్కరాల సందర్భంగా నిర్మిస్తున్న పుష్కరఘాట్‌ పనులను వెంటనే పూర్తిచేయాలని మండల ప్రత్యేక అధికారి శ్యాంసుందర్‌రెడ్డి అన్నారు.

మక్తల్‌ : కృష్ణా పుష్కరాల సందర్భంగా నిర్మిస్తున్న పుష్కరఘాట్‌ పనులను వెంటనే పూర్తిచేయాలని మండల ప్రత్యేక అధికారి శ్యాంసుందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పంపదేవ్‌పాడులో మంగళవారం పల్లెవికాసం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో కృష్ణానదికి సమీపంలో నిర్మించిన పుష్కరఘాట్‌ పనులను త్వరగా చేయాలని సిబ్బందిపై అగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు గ్రామంలో పర్యటించి డ్రెయినేజీలు, పాఠశాల, రేషన్‌షాపు, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. తమ పరిధిలో ఉన్న వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయనిర్మల, సూపరింటెండెంట్‌ జయశంకర్‌ ప్రసాద్, తహసీల్దార్‌ ఓంప్రకాష్, ఏఓ సుబ్బారెడ్డి, ఆర్‌ఐ కాలప్ప, ఎంఈఓ లక్ష్మినారాయణ, వీఆర్‌ఓ బాలప్ప, ఏపీఎం నారాయణ, సర్పంచ్‌ సుశీలమ్మ, ఎంపీటీసీ రాములు తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement