గంగ.. తీర్చింది బెంగ! | faemer well leaky in sesenally | Sakshi
Sakshi News home page

గంగ.. తీర్చింది బెంగ!

Feb 24 2016 2:44 AM | Updated on Oct 1 2018 2:44 PM

గంగ.. తీర్చింది బెంగ! - Sakshi

గంగ.. తీర్చింది బెంగ!

తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎండిన బావిలో నీరు ఊరుతుండడం ఆ రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎండిన బావిలో నీరు ఊరుతుండడం ఆ రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  మండలంలోని కేరెళ్లి గ్రామానికి చెందిన సోదర ద్వయం నర్సింగనోళ్ల బిచ్చిరెడ్డి, అనంత్‌రెడ్డిలకు తరిగోపుల గ్రామ శివారు వ్యవసాయ భూమి ఉంది. పొలంలో ఉన్న బావిలోని నీటితోనే ఇటీవల కూరగాయలు, ఆకుకూరలు సాగు చే శారు. అయితే నవంబర్‌లో బావి పూర్తిగా ఎండిపోవడంతో రెండు బోర్లు వేశారు. ఒక దాంట్లో మాత్రమే ఇంచు నీరు రావడంతో పంటలు ఎండిపోతాయన్న ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో ఐదు రోజులుగా బావిలో నీరు ఊరుతుండడం రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే.. బావిలో నీటిని తోడేసినా ఆరు ఫీట్ల వరకు నీరు యథాలాపంగా వస్తుండడం గమనార్హం.  - ధారూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement