విద్యాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
చింతపల్లి
విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు.
చింతపల్లి
విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఆనంద నిలయం హాస్టళ్లలో విద్యార్థులకు దుప్పట్లు, పెట్టెలు తదితర సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ నాగభూషణ్‌రావు, హాస్టల్ వార్డెన్లు బలరాం, శ్రీనివాస్, రుణాదేవి, మాజీ ఎంపీపీ బోరిగం భూపాల్, నాయకులు నట్వ గిరిధర్, ఎల్లెంకి అశోక్, చంద్రశేఖర్, బిచ్యానాయక్, కుకుడాల శేఖర్, సత్యనారాయణశర్మ, అక్రమ్‌యాదవ్, సలీం, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.