పప్పు, ఆవకాయ బాగుందే..! | Sakshi
Sakshi News home page

పప్పు, ఆవకాయ బాగుందే..!

Published Tue, Jun 28 2016 8:51 AM

పప్పు, ఆవకాయ బాగుందే..!

తణుకు టౌన్ : విదేశీ యువకులు తణుకు పట్టణంలో సోమవారం సందడి చేశారు. ఆధ్యాత్మిక యాత్రలో బాగంగా తణుకు పట్టణం వచ్చిన ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒలీవర్ అతని మిత్రుడు స్థానిక అమూల్య మెస్‌లో భోజనం చేశారు. కేవలం శాఖాహార భోజనాన్నే వారు స్వీకరించారు. ఆంధ్రా భోజనం రుచిగా ఉందన్నారు.

తమ దేశంలోనైతే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వరి అన్నంతో భోజనం చేస్తామని చెప్పారు. ఫ్రాన్స్‌లో రోజూ రొట్టెలు, స్నాక్స్ తిని జీవించే తమకు ఇక్కడ హోటల్స్‌లో వడ్డించే ప్రతి కూర రుచికరంగానే వుందని పేర్కొన్నారు. అన్నంలో  పప్పు, ఆవకాయ మరీ రుచికరంగా ఉందన్నారు. కాకపోతే తమ దేశంలో పంటలపై పురుగుమందుల వాడకం తక్కువని చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement