జీతాల బకాయిల కోసం నగర పాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ నగరపాలక సంస్థ కార్యాలయం వరకు కొనసాగింది.
కాంట్రాక్ట్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
Sep 22 2016 11:26 PM | Updated on Sep 4 2017 2:32 PM
విజయవాడ సెంట్రల్ :
జీతాల బకాయిల కోసం నగర పాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ నగరపాలక సంస్థ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం కార్మికులు ధర్నా చేశారు. నాలుగు రోజులుగా జీతాల కోసం పోరాటం చేస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం దారుణమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లతో కొందరు అధికారులు కుమ్మక్కు అవ్వడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. మూడు నెలలుగా జీతాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. కార్మికుల జీతాల సొమ్మును దిగమింగిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకులు ముజ్‌ఫర్ అహ్మద్, మునిసిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి ఎం.డేవిడ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement