మరో ముందడుగు

మరో ముందడుగు - Sakshi


కార్యాచరణను ప్రకటించిన ప్రభుత్వం..

సీఎం సదస్సులో ‘గిరి మరణాల’ ప్రత్యేక ప్రస్తావన

ఆదివాసీల మరణాలు’ మాట వినిపించకూడదన్న కేసీఆర్

పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు

జిల్లా విభిన్న భౌగోళిక పరిస్థితులపై చర్చ


 

 

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై మరో ముందడుగు పడింది. దీనికి సంబంధించి ప్రభుత్వం బుధవారం కార్యాచరణను ప్రకటించింది. హైదరాబాద్‌లో బుధవారం రెండో రోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించి రూపొందించి న ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేశారు. గ్రా మాలు, మండలాలు, ని యోజకవర్గాలు, స్థానిక సం స్థలు వంటి పరిపాలన యూనిట్లు, ఆయా మండలాలు, గ్రామాల జనా భా, కుటుంబాలు, పట్టణ, గ్రామీణ జనాభా, అక్షరాస్యత, చారిత్ర, భౌ గోళిక విస్తీర్ణం, విద్యా, వైద్యం రంగం, కల్చరల్, టూరిజం, పరిశ్రమ లు, గనులు, రవాణా రంగం, ప్రభుత్వ ఆదాయ వనరులు, కమ్యూనికేషన్, పోలీసు వ్యవస్థ, మొత్తం 16 అంశాల సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేశారు. కాగా.. ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు రోడ్‌మ్యాప్‌ను ప్రకటించింది.



దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామడంతో కొత్త జిల్లాపై ఆశలు పెరుగుతున్నాయి. అయితే.. ప్రభుత్వం మాత్రం జిల్లాను రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకే మొగ్గు చూపే అవకాశాలున్నాయని అధికార వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.





ఆచితూచి నిర్ణయం..

కొత్త జిల్లాల విషయంలో జిల్లాలో పలు డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా బెల్లంపల్లిని జిల్లాను చేయాలని బెల్లంపల్లి వాసులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పట్టణ బంద్, దీక్షలు, వినతిపత్రాలు వంటి కార్యక్రమాలతో తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు నిర్మల్ జిల్లా కోసం కూడా ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్నాయి. తాజాగా అన్ని ప్రజా, కులసంఘాలతో కలిసి నిర్మల్ జిల్లా సాధన సమితి ఏర్పడింది. ఈ మేరకు బుధవారం నిర్మల్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి, ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.



మరోవైపు ఆసిఫాబాద్‌ను కూడా జిల్లా చేయాలని గతంలో నెల రోజులపాటు దీక్షలు జరిగాయి. కాగజ్‌నగర్‌ను కూడా జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ సదస్సులు జరిగాయి. ఇలా పలు డిమాండ్లు తెరపైకి వస్తుండటంతో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజల అభిమతం మేరకే జరగాలని సీఎం ఈ సమావేశంలో సూచించారు. ఈ మేరకు రోడ్‌మ్యాప్‌ను బుధవారం ప్రకటించింది. అవసరమైతే అఖిలపక్షం సమావేశాలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ నెల 20లోపు శాస్త్రీయబద్ధంగా రూపొందించిన నివేదికలను సమర్పించాలని కలెక్టర్‌లను సీఎం ఆదేశించారు. ఆగస్టు మొదటి వారంలో డ్రాఫ్టు నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు. తర్వాత నెల పాటు అభ్యంతరాలను తీసుకుంటారు. అనంతరం జిల్లాల ఏర్పాటుకు సంపూర్ణ ప్రక్రియను పూర్తి చేసి దసర నాటికి నూతన జిల్లాల ఆవిర్భావం అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది.





ఆదివాసీల మరణాలపై ప్రత్యేక ప్రస్తావన..

సీఎం కేసీఆర్ నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో ఆదిలాబాద్ జిల్లాలోని ఆసివాసీల మరణాల అంశం ప్రత్యేకంగా చర్చకొచ్చింది. అంటురోగాలతో ఆదిలాబాద్ జిల్లాలో మరణాలు అనే మాటే వినపడకూడదని సీఎం అధికారులను ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా చూడాలని, మందులు అందుబాటులో ఉంచాలన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top