‘క్లోజ్‌’వే! | causeway collapesed due to heavy rain | Sakshi
Sakshi News home page

‘క్లోజ్‌’వే!

Sep 22 2016 11:10 PM | Updated on Sep 13 2018 5:04 PM

బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తున్న అగ్నిమాపక సిబ్బంది - Sakshi

బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తున్న అగ్నిమాపక సిబ్బంది

పాచిపెంట మండలం మోసూరు వద్ద వట్టిగెడ్డపై నిర్మించిన కాజ్‌వే గురువారం మధ్యాహ్నం కొట్టుకుపోయింది. అదే సమయంలో గెడ్డదాటుతున్న నలుగురు కొట్టుకుపోగా... వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

వట్టిగెడ్డ ఉధతికి కొట్టుకుపోయిన కాజ్‌వే
అదే సమయంలో నది దాటుతున్న ముగ్గురి గల్లంతు
సురక్షితంగా బయటకు తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
 
సాలూరు : పాచిపెంట మండలం మోసూరు వద్ద వట్టిగెడ్డపై నిర్మించిన కాజ్‌వే గురువారం మధ్యాహ్నం కొట్టుకుపోయింది. అదే సమయంలో గెడ్డదాటుతున్న నలుగురు కొట్టుకుపోగా... వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మధ్యాహ్నం మూడుగంటల సమయంలో ఈ కాజ్‌వే కొట్టుకుపోగా... అదే సమయంలో కాజ్‌వేనుంచి గెడ్డ దాటుతున్న మోసూరుకు చెందిన నలుగురు వ్యక్తులు ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న పలువురు సాలూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆ సిబ్బంది ఉధతంగా ప్రవహిస్తున్న నదిని దాటుకుంటూ వెళ్లి నలుగురు యువకులనూ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఇదిలావుండగా హుద్‌హుద్‌ తుఫాన్‌ సమయంలోనే కాజ్‌వే కొంతమేరకు కొట్టుకుపోయింది. దానికి చేపట్టిన మరమ్మత్తు పనులు తూతూమంత్రంగా జరిపారన్న విమర్శలున్నాయి. ఆ కారణంగానే బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతోlమిగిలిన కాజ్‌వే కొట్టుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement