చిల్లర సమస్యతో చిరు వ్యాపారులు పడరాని పాట్లు పడుతున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
చార్మినార్: చిల్లర సమస్యతో చిరు వ్యాపారులు పడరాని పాట్లు పడుతున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినోత్సవం సందర్భంగా శనివారం పాతబస్తీ ఖాద్రీ కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్ మహ్మద్ గౌస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, రాజీవ్ సేవా సమితి అధ్యక్షుడు, చార్మినార్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వెంకటేశ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు షమీమ్ సుల్తానా, మాజీ కార్పొరేటర్ మహ్మద్ మేరాజ్ పాల్గొన్నారు.