breaking news
Mohammad Gaus
-
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
విడదీసేందుకు తల్లిదండ్రుల ప్రయత్నం రక్షణ కల్పించిన టూ టౌన్ పోలీసులు మదనపల్లె టౌన్ : వారు వేర్వేరు మతాలకు చెందిన వారు. ఇద్దరి భావాలు కలవడంతో ప్రేమలో పడ్డారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కలిసి జీవించాలని భావించారు. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రేమజంటను విడదీయాలని విశ్వప్రయత్నం చేశారు. ఇద్దరూ మేజర్లు కావడంతో యువతి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వడంతో కథ సుఖాంతమైం ది. ఈ సంఘటన మదనపల్లెలో శనివారం చోటుచేసుకుంది. ప్రేమికుల కథనం మేరకు.. మదనపల్లె మండలం సీటీఎం పంచాయతీ క్రాస్ రోడ్డు లో నివాసముంటున్న ఎస్ఏ ఖాదర్ కుమారుడు మహమ్మద్‌గౌస్(30) ఐదేళ్లుగా హైదరాబాదులోని సీఎం పేషీ స్కిల్‌డెవలప్‌మెంట్‌లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. విజయవాడకు చెందిన కొత్తపల్లె దస్మంతరావు కుమార్తె శిల్ప(28) హైదరాబాదులోనే ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తోంది. పక్కపక్కనే నివాసం ఉన్న ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసిం ది. దీంతో శిల్పకు మరో వ్యక్తితో పెళ్లి చేయడానికి రంగం సిద్ధం చేశారు. దీంతో ఇద్దరూ రెండు వారాల క్రితం ఇంటి నుంచి పారిపోయి హైదరాబాదు సమీపంలోని ఓ ఆలయంలో మతాంతర వివాహం చేసుకున్నారు. అనంతరం ప్రియుడి స్వగ్రామమైన మదనపల్లె మండలం సీటీఎం చేరుకున్నారు. అమ్మాయి తరపు నుంచి ప్రమాదం పొంచి ఉందని భావించి స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శిల్ప తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి మదనపల్లె చేరుకున్నా రు. ప్రేమజం టను విడదీయడానికి రాజకీయ పలుకుబడి ఉపయోగించి విశ్వప్రయత్నా లు చేశారు. వారి కన్నుగప్పి టూటౌన్ పోలీసుస్టేషన్ చేరుకున్న ప్రేమజంట రక్షణ కల్పించాలని సీఐ హనుమంత్ నాయక్‌ను కోరారు. ఈ విషయం తెలియడంతో విలేకరులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇద్దరూ మేజర్లు కావడంతో వారి జోలి కి వెళ్ల వద్దని సీఐ అమ్మాయి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో సమస్య సద్దుమనిగింది. -
చిల్లర సమస్యతోచిరు వ్యాపారుల ఇబ్బంది
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చార్మినార్: చిల్లర సమస్యతో చిరు వ్యాపారులు పడరాని పాట్లు పడుతున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినోత్సవం సందర్భంగా శనివారం పాతబస్తీ ఖాద్రీ కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్ మహ్మద్ గౌస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, రాజీవ్ సేవా సమితి అధ్యక్షుడు, చార్మినార్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వెంకటేశ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు షమీమ్ సుల్తానా, మాజీ కార్పొరేటర్ మహ్మద్ మేరాజ్ పాల్గొన్నారు.