సంగం : మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ ఏడాది చివరినాటికి నూరుశాతం మరుగుదొడ్లు నిర్మంచు కునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆత్మగౌరవం జిల్లా కో–ఆర్డినేటర్ సుస్మితారెడ్డి అన్నారు.
ప్రజలకు అవగాహన కల్పించండి
Jul 20 2016 5:05 PM | Updated on Aug 28 2018 5:25 PM
	సంగం : మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ ఏడాది చివరినాటికి నూరుశాతం మరుగుదొడ్లు నిర్మంచు కునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆత్మగౌరవం జిల్లా కో–ఆర్డినేటర్ సుస్మితారెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రమైన సంగంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ జయరామయ్యకు ఆత్మగౌరవం కార్యక్రమంపై పలు సూచనలు, సలహాలు అందజేశారు. అన్ని గ్రామల్లో నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించుకుని, వినియోగంలోకి తెచ్చేలా చర్యలు చేపట్టాని తెలిపారు. లబ్ధిదారులకు బిల్లులు మంజూరులో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. ఆమె వెంట పీఆర్ ఏఈ మల్లికార్జున, ఆర్‌డబ్ల్యూస్ అధికారి గౌస్‌అహ్మద్, ఈఓపీఆర్డీ రవికుమార్ తదితరులున్నారు.
Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
