జియోకు ధీటుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్లు | bsnl offers more than jio | Sakshi
Sakshi News home page

జియోకు ధీటుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్లు

Mar 16 2017 11:15 PM | Updated on Sep 5 2017 6:16 AM

బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ జియోకు ధీటుగా ఆఫర్లను ప్రవేశపెట్టింది. కేవలం రూ.6కే 1జీబీ 3జీ డేటాను అందిస్తున్నట్లు సంస్థ జనరల్‌ మేనేజర్‌ వెంకటనారాయణ గురువారం తెలిపారు.

అనంతపురం రూరల్‌ : బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ జియోకు ధీటుగా ఆఫర్లను ప్రవేశపెట్టింది. కేవలం రూ.6కే 1జీబీ 3జీ డేటాను అందిస్తున్నట్లు సంస్థ జనరల్‌ మేనేజర్‌ వెంకటనారాయణ గురువారం తెలిపారు. రూ.339తో రీచార్జ్‌ చేసుకున్న ప్రీపెయిడ్‌ వినియోగదారులకు నెలరోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటా ఉచితమని, బీఎస్‌ఎన్‌ఎల్‌ టు బీఎస్‌ఎన్‌ఎల్ కాల్స్‌ అన్‌లిమిటెడ్‌ అని తెలిపారు. అలాగే ప్రతిరోజూ 25నిమిషాల పాటు ఇతర నెట్‌వర్క్‌లకు కూడా ఉచితంగా ఫోన్‌ చేసుకోవచ్చన్నారు. వీటితోపాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ లైన్‌ నుంచి ఇతర నెట్‌వర్కులకు సంబంధించిన మూడు నెంబర్లకు రూ.49లతో నెలరోజులపాటు అన్‌లిమిటెడ్‌గా మాట్లాడుకునే సదుపాయాన్ని కల్పిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఇన్‌స్టాలేషన్‌ చార్జీల మినహాయింపు
ఈనెల 31వరకు ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్, ఫైబర్‌టూహోం కనెక్షన్లు తీసుకునే వినియోగదారులకు ఇన్‌స్టాలేషన్‌ చార్జీలను మినహాయిస్తున్నట్లు జనరల్‌ మేనేజర్‌ తెలిపారు. వీటితోపాటు పాత కనెక్షన్లు పునరుద్ధరించుకునే అవకాశాన్ని సైతం సంస్థ కల్పిస్తోందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement