రాష్ట్రంలో టీడీపీ చేసిందేమీ లేదు : సోము వీర్రాజు | BJP MLC Somu Veerraju takes on TDP | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో టీడీపీ చేసిందేమీ లేదు : సోము వీర్రాజు

Dec 13 2015 9:22 AM | Updated on Mar 29 2019 8:30 PM

రాష్ట్రంలో టీడీపీ చేసిందేమీ లేదు : సోము వీర్రాజు - Sakshi

రాష్ట్రంలో టీడీపీ చేసిందేమీ లేదు : సోము వీర్రాజు

రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు.

సీతానగరం: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడిలో ఆయనను పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో టీడీపీ తన ఘనతగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ గెలుపునకు తనే కారణమని, పవన్ కళ్యాణ్‌ను టీడీపీకి మద్దతు ఇవ్వాలని కలిపింది తానేనని చెప్పారు. దేశంలో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా తీసుకువెళ్లడానికి బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement