రాష్ట్ర వ్యాప్తంగా బ్యాడ్మింటన్‌ అకాడమీలను ఏర్పాటు చేస్తాం | badminton acadamies in state wide | Sakshi
Sakshi News home page

రాష్ట్ర వ్యాప్తంగా బ్యాడ్మింటన్‌ అకాడమీలను ఏర్పాటు చేస్తాం

Aug 31 2016 6:48 PM | Updated on Sep 4 2017 11:44 AM

రాష్ట్ర వ్యాప్తంగా బ్యాడ్మింటన్‌ అకాడమీలను ఏర్పాటు చేస్తామని బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ పేర్కొన్నారు. ప్రొద్దుటూరులోని జార్జ్‌కారొనేషన్‌క్లబ్‌లోని వర్రా గురివిరెడ్డి ఇండోర్‌ స్టేడియంలో బుధవారం రాష ్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

ప్రొద్దుటూరు కల్చరల్‌:
 రాష్ట్ర వ్యాప్తంగా బ్యాడ్మింటన్‌ అకాడమీలను ఏర్పాటు చేస్తామని  బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ పేర్కొన్నారు. ప్రొద్దుటూరులోని జార్జ్‌కారొనేషన్‌క్లబ్‌లోని వర్రా గురివిరెడ్డి ఇండోర్‌ స్టేడియంలో బుధవారం రాష ్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఒలింపిక్‌లో పి.వి.సింధు బ్యాడ్మింటన్‌లో వెండి పతకం సాధించడంతో  దేశ వ్యాప్తంగా ఈ క్రీడకు విశేష ఆదరణ లభిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బ్యాడ్మింటన్‌ అభివద్ధికి అకాడమీలను నెలకొల్పుతామన్నారు. దేశంలో బ్యాడ్మింటన్‌ క్రీడ అభివద్ధి చెందిందంటే అది ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఘనతే అని చెప్పారు. బ్యాడ్మింటన్‌లో పతకాలు సాధిస్తున్న వారంతా ఆంధ్రప్రదేశ్‌లోనే నేర్చుకున్నామని చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో 6 అకాడమిలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతామన్నారు. క్రీడల్లో తెరవెనుక కష్టపడేవారు ఎందరో ఉంటారని, తగిన మౌలిక వసతులు ఉంటే ఎందరో క్రీడాకారులను తయారు చేయవచ్చని పేర్కొన్నారు. సింధుకు రూ.20 కోట్ల వరకు నగదు ప్రోత్సాహక బహుమతులు వచ్చాయని అదే డబ్బును బ్యాడ్మింటన్‌ అభివద్ధికి ఖర్చుచేస్తే 20 మంది సింధులను తయారు చేయవచ్చని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement