నలుగురిపై అట్రాసిటి కేసు | atrasiti case on four persons | Sakshi
Sakshi News home page

నలుగురిపై అట్రాసిటి కేసు

Jul 20 2016 8:03 PM | Updated on Mar 28 2018 11:26 AM

కులం పేరుతో దూషించిన నలుగురు వ్యక్తులపై పోలీసులు అట్రాసిటి కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ అహ్మద్‌పాషా కథనం ప్రకారం..

శంషాబాద్‌ రూరల్‌: కులం పేరుతో దూషించిన నలుగురు వ్యక్తులపై పోలీసులు అట్రాసిటి కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ అహ్మద్‌పాషా కథనం ప్రకారం.. నగరానికి చెందిన రాందాస్‌కు మండలంలోని పెద్దతూప్రలో వ్యవసాయం పొలం ఉంది. గ్రామానికి చెందిన ఎం.నర్సింహా కొంత కాలం పాటు ఆయన పొలంలో పనిచేశాడు. అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో రాందాస్‌ పనిలోనుంచి  తొలగించాడు. దీంతో గ్రామానికి చెందిన జాన్‌రెడ్డి, అంజయ్య, కుమార్‌, సాయిలు, మరికొందరు వచ్చి రాందాస్‌ను కులంపేరుతో దూషించడమే కాకుండా బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు బుధవారం నలుగురిపై అట్రాసిటి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement