దివ్యాంగుల పునరావాస యోజన కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు, చేతులు, క్యాలిపర్స్ అందిస్తున్నట్లు భారత్ వికాస్ పరిషత్ ఆంధ్ర ప్రాంత సహ కార్యదర్శి బీవీ బాలసుబ్రమణ్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు
Apr 25 2017 11:04 PM | Updated on Sep 5 2017 9:40 AM
కర్నూలు(టౌన్): దివ్యాంగుల పునరావాస యోజన కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు, చేతులు, క్యాలిపర్స్ అందిస్తున్నట్లు భారత్ వికాస్ పరిషత్ ఆంధ్ర ప్రాంత సహ కార్యదర్శి బీవీ బాలసుబ్రమణ్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొలిమేర వేణుగోపాల్, కామాక్షమ్మ చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో జైపూర్ కాలు కంటే నాణ్యమైన కృత్రిమ కాలును ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వచ్చే నెల 14వ తేదీ లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 94404 41447 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
Advertisement
Advertisement