హేవళంబి నామ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని ఉగాది విశిష్ట ప్రతిభారత్న పురస్కారాల ఎంపికకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు ఇ.ఎస్.ఎస్.నారాయణ తెలిపారు
ఉగాది విశిష్ట ప్రతిభారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
Mar 19 2017 12:06 AM | Updated on Sep 5 2017 6:26 AM
కర్నూలు(న్యూసిటీ): హేవళంబి నామ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని ఉగాది విశిష్ట ప్రతిభారత్న పురస్కారాల ఎంపికకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు ఇ.ఎస్.ఎస్.నారాయణ తెలిపారు. కవులు, రచయితలు, కళాకారులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, మేధావులు, వైద్యులు, సమాజ సేవకులు, ఆధ్యాత్మిక, యోగా గురువులు, కార్మికులు, కర్షకులు, క్రీడాకారులకు 2017 ఏప్రిల్ 2న ప్రతిభా పురస్కారాలతో సన్మానిస్తామన్నారు. ప్రతిభ పురస్కారాల ఎంపికకు, సర్టిఫికెట్లు, ఫొటోలు, పత్రికల క్లిప్పింగ్స్ జిరాక్స్ కాపీలతో పాటు నాలుగు పాస్‌పోర్టు సైజు ఫొటోలను దరఖాస్తుకు జత చేసి ఈనెల 26లోపు ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ, డోర్ నెం.1–20–103, మొదటి అంతస్తు, గోకుల్ నగర్, వెంకటాపురం, తిరుమలగిరి(పోస్టు), సికింద్రాబాద్–15కు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 96523 47207కు సంప్రదించాలన్నారు.
Advertisement
Advertisement