విద్యార్థిని ఆత్మహత్య కేసులో ఆరుగురి అరెస్ట్ | 6 arrested in student tirupathamma committed suicide case | Sakshi
Sakshi News home page

విద్యార్థిని ఆత్మహత్య కేసులో ఆరుగురి అరెస్ట్

Nov 10 2015 3:00 PM | Updated on Nov 9 2018 4:59 PM

తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక విద్యార్థిని తిరుపతమ్మ బలవన్మరణానికి పాల్పడ్డ కేసుకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

గుంటూరు : తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక విద్యార్థిని తిరుపతమ్మ బలవన్మరణానికి పాల్పడ్డ కేసుకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను గుంటూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రెండు రోజుల కిందట(ఆదివారం) ఆమె ఆత్మహత్యకు పాల్పడిని విషయం విదితమే. మాచర్లలోని కృష్ణవేణి ఇంటర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండేది.

ఈ క్రమంలో తోటి విద్యార్థుల వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడటం జిల్లాలో సంచలనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపిన ఏఎన్యూ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య అనంతరం విద్యార్థులకు సరైన రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమవడంతో అదే తీరుగా తిరుపతమ్మ ఆత్మహత్య ఘటన చోటుచేసుకుందని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement