వేగంగా వస్తున్న లారీ కింద పడి ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
లారీ కిందపడి చిన్నారికి తీవ్రగాయాలు
Aug 10 2016 3:49 PM | Updated on Sep 4 2017 8:43 AM
కామేపల్లి: వేగంగా వస్తున్న లారీ కింద పడి ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొత్తలింగాల వద్ద బుధవారం ఉదయం చోటు చేసుకుంది. రోడ్డు మీద ఆడుకుంటున్న చిన్నారి(5) ప్రమాదవశాత్తు లారీ కిందపడటంతో.. తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు బాలికను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement