: ఈ నెల 30న ఎంగిలి పువ్వు బతుకమ్మ, అక్టోబరు 8న∙సద్దుల బతుకమ్మ, 9న దుర్గాష్టమి, 10న మహార్నవమి, 11న విజయదశమి పండుగలు జరుపుకోవాలని కోరారు.
నల్లగొండ కల్చరల్: ఈ నెల 30న ఎంగిలి పువ్వు బతుకమ్మ, అక్టోబరు 8న∙సద్దుల బతుకమ్మ, 9న దుర్గాష్టమి, 10న మహార్నవమి, 11న విజయదశమి పండుగలు జరుపుకోవాలని కోరారు. జిల్లా అర్చక వైదిక బ్రాహ్మణ ఆధ్వర్యంలో గురువారం స్థానిక పానగల్లు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ పండుగలను నిర్వహించాల్సిన తేదీలను ఏకగ్రీవంగా ఆమోదించారు. అక్టోబరు 10 వరకు గురుమౌడ్యమి ఉన్నందున ఎటువంటి శుభకార్యములు జరుపుకోవడానికి అవకాశం లేదని తెలిపారు. ఈ సమావేశంలో అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, వైదిక బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు గుదె లక్ష్మీనర్సయ్య శర్మ, అర్చక సంఘం గౌరవ అధ్యక్షులు దౌలతాబాదు వాసుదేవశర్మ, కోడుగంటి వెంకటరమణ శర్మ, కందాళ శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు.