జూన్ 26న టెక్సాస్‌లో టీఈఏ సమావేశం | telugu entrepreneurs association on june 26th in texas | Sakshi
Sakshi News home page

జూన్ 26న టెక్సాస్‌లో టీఈఏ సమావేశం

Jun 17 2016 8:07 PM | Updated on Sep 4 2017 2:44 AM

జూన్ 26న టెక్సాస్‌లో టీఈఏ సమావేశం

జూన్ 26న టెక్సాస్‌లో టీఈఏ సమావేశం

తెలుగు వారు వ్యాపార రంగంలో అభివృద్ధిచెందడానికి కావల్సిన విలువైన సమాచారం, మెలకువలు అందిచడానికి తెలుగు ఎంటర్‌ ప్రెన్యూర్స్ అసోసియేషన్(టీఈఏ) ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

టెక్సాస్: తెలుగు వారు వ్యాపార రంగంలో అభివృద్ధిచెందడానికి కావల్సిన విలువైన సమాచారం, మెలకువలు అందిచడానికి  తెలుగు ఎంటర్‌ ప్రెన్యూర్స్ అసోసియేషన్(టీఈఏ) ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జూన్ 26న మధ్యాహ్నం 2 గంటన నుంచి 5 వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లో పశ్చిమ వాల్‌నట్ హిల్ లేన్‌లోని దేసీ ప్లాజా స్టుడియోలో మీట్ ఓల్డ్ ప్రెండ్స్ అండ్ మేక్ న్యూ ఫ్రేండ్స్ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో లలిత్ తోట( మయూరి ఇండియన్ రెస్టారెంట్ ఓనర్, ఇర్వింగ్, టెక్సాస్), సిమన్ బోజాస్(గెంగిస్ గ్రిల్లో పార్ట్నర్), లిండా ఎల్ విలియమ్స్(ఎస్‌బీఏ, ఆర్థిక శాస్త్ర నిపుణులు), కెన్ సురి ( వన్ వరల్డ్ బ్యాంక్ వ్యవస్థాపకులు, ఛైర్మన్)లు పాల్గొని విలువైన సూచనలు ఇవ్వనున్నారు. రెస్టారెంట్‌లను ప్రారంభించి, విజయవంతంగా ఎలా నడాపాలి, ప్రాంచైజీ రంగంలో మెలకువలు, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం వంటి అంశాల మీద చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎంట్రీ ఉచితం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement