మోడీకి శుభాకాంక్షలు తెలిపిన ఓఎఫ్బీజేపీ | OFBJP congratulates Modi on being nominated as PM candidate | Sakshi
Sakshi News home page

మోడీకి శుభాకాంక్షలు తెలిపిన ఓఎఫ్బీజేపీ

Sep 14 2013 12:53 PM | Updated on Mar 29 2019 5:57 PM

గుజరాత్ సీఎం నరేంద్రమోడీని ప్రధాని మంత్రి పదవికి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేయడాన్ని యూఎస్లోని ఓఎఫ్బీజేపీ హార్షం వ్యక్తం చేసింది.

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని భారత ప్రధాని మంత్రి పదవికి అభ్యర్థిగా భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ఎంపిక చేయడాన్ని యూఎస్లోని ఆ పార్టీ అనుబంధ సంస్థ  ద ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (ఓఎఫ్బీజేపీ) హార్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మోడీకి శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఓఎఫ్బీజేపీ శనివారం ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.   

 

న్యూఢిల్లీలో నిన్న జరిగిన బీజేపీ కార్యవర్గం సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ గుజరాత్ సీఎం నరేంద్రమోడీ పేరును ప్రకటించగానే తమకు ఆనందానికి అవధులు లేవని ఆ ప్రకటనలో వెల్లడించింది.  ప్రధాని అభ్యర్థిగా మోడీని ఎంపిక చేసినందుకు రాజ్నాథ్కు ఓఎఫ్బీజేపీ ధన్యవాదాలు తెలిపింది. అలాగే ఈ నెల 20 నుంచి 21 వరకు ఫ్లారెడాలోని తంపాలో జరిగే ఓఎఫ్బీజేపీ వార్షిక సదస్సులో ఆహ్వానితులను ఉద్దేశించి మోడీ వీడియో కాన్ఫరేన్స్ ద్వారా ప్రసంగిస్తారని ఓఎఫ్బీజేపీ వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement