మంచానికి కట్టేసి.. పెట్రోలు పోసి.. | Young Man Set On Fire Alive In Chennai | Sakshi
Sakshi News home page

మంచానికి కట్టేసి.. పెట్రోలు పోసి..

Jun 7 2019 9:02 PM | Updated on Jun 7 2019 9:02 PM

Young Man Set On Fire Alive In Chennai - Sakshi

సాక్షి, చెన్నై : నేరమే చేశాడో లేక పాతపగలతో ఎవరైనా కసిగా కక్షనే తీర్చుకున్నారో తెలియదు.. ఓ యువకుడిని మంచానికి కట్టేసి, పెట్రోలు పోసి నిప్పంట్టించారు. యువకుడిని కిరాతకంగా సజీవదహనం చేసిన ఉదంతం తేనీ జిల్లాలో గురువారం జరిగింది. తేనీ జిల్లా మూనార్‌ జాతీయ రహదారిలోని బోడినాయకనూరులో భూగర్భ డ్రైనేజీ నీటి శుద్ధీకరణ కేంద్రం ఉంది. ఈ కేంద్రం ఆవరణలో మంచానికి యువకుడు కట్టేసి పూర్తిగా కాలిపోయిన స్థితిలో పడిఉన్నాడు. ఉదయం విధులకు హాజరయ్యేందుకు వచ్చిన నీటి శుద్ధీకరణ కేంద్రం ఉద్యోగులు ఆ దృశ్యాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు శవాన్ని పోస్టుమార్టానికి పంపారు. యువకుడి దేహంతోపాటూ ముఖం కూడా పూర్తిగా కాలిపోవడంతో అతడు ఎవరో గుర్తించలేకపోయారు. డీఎస్పీ ఈశ్వరన్‌ నేతృత్వంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement