యువతికి నమ్మబలికి.. వ్యభిచార కూపంలోకి! | Women rescued young lady from sex racket | Sakshi
Sakshi News home page

Jun 21 2018 1:36 PM | Updated on Jul 23 2018 8:51 PM

Women rescued young lady from sex racket - Sakshi

సాక్షి, విజయవాడ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. నగరానికి వచ్చిన ఓ అభాగ్య యువతిని నమ్మించి వ్యభిచారం కూపంలోకి దించారు కొందరు దుర్మార్గులు. కూలిపని ఇప్పిస్తానని నమ్మబలికిన ఆటో డ్రైవర్‌.. ఆమెను  వ్యభిచార నిర్వాహకురాలికి రూ. 20వేలకు అమ్మేశాడు. దీంతో ఏడాదికాలంగా ఆ యువతి నరకం అనుభవిస్తోంది. ఈ ఘటన వివరాలివి..

ఖమ్మంజిల్లాకు చెందిన యువతి తల్లిదండ్రులు చనిపోవడంతో పెదనాన్న ఆశ్రయంలోకి వెళ్లింది. పెద్దనాన్న ముసలివాడికి ఇచ్చి పెళ్ళి చేయడంతో.. ఆ పెళ్లి ఇష్టం లేని ఆమె ఇంటి నుంచి పారిపోయి విజయవాడ వచ్చింది. విజయవాడ బస్టాండ్‌లో ఉన్న తనను ట్రాప్‌ చేసి ఓ ఆటో డ్రైవర్‌ శోభారాణి అనే మహిళకు అమ్మేశాడు. జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీలో వ్యభిచార వృత్తిని నిర్వహిస్తున్న శోభారాణి.. ఆ యువతిని అన్ని ప్రాంతాలకూ తిప్పి వ్యభిచారం చేయాలంటూ ముప్పుతిప్పలు పెట్టింది. బాధిత యువతితోపాటు కాలనీలోని మరికొంతమందిని వ్యభిచార కూపంలోకి ఆమె దింపినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్థానికుల సహాయంతో వ్యభిచార కూపం నుంచి బాధితురాలు బయటపడింది. స్థానిక మహిళలు ఆమెను కాపాడారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. మామూళ్ల మత్తులో జోగుతున్న వారు.. నిర్వాహకురాలికే సాయం చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. తన ఫిర్యాదును కనీసం పట్టించుకోవడం లేదని ఆమె తెలిపారు.

అదుపులో నిర్వాహకురాలు..
మాకు వచ్చిన సమాచారం మేరకు జక్కంపూడిలో సోదాలు నిర్వహించి.. వ్యభిచార గృహం నిర్వాహకురాలు శోభారాణిని అదుపులోకి తీసుకున్నామని సీఐ మురళీకృష్ణ తెలిపారు. వ్యభిచారం నిర్వహించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శోభారాణి వ్యభిచారం నిర్వహిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారని తెలిపారు. స్థానికుల ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోలేదన్న మాటలు అవాస్తవమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement