
గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులు
వరంగల్, రైల్వేగేట్: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడిన మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం వరంగల్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ప్రయాణికులు, జీఆర్పీ సీఐ జూపల్లి వెంకటరత్నం తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 11.23 గంటలకు కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి మంజు అనే మహిళ ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫాం–1పై పడిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రురాలిని తరలించేందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేయగా, ఆలస్యంగా వచ్చింది. స్థానికంగా విధులు నిర్వర్తిస్తున్న జీఆర్పీ సిబ్బంది నర్సింహస్వామి, శారద గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. సదరు మహిళ ఓరిస్సా రాష్ట్రానికి చెందిన గోడులపునార్‌కు చెంది నట్లు సీఐ తెలిపారు.