రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Unknown Person Died In PSR Nellore Railway Station - Sakshi

తడ: మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి (60) శుక్రవారం మృతిచెందాడు. స్టేషన్‌ వద్ద ప్రయాణికులు కూర్చునేందుకు ఏర్పాటుచేసిన బెంచీపై మృతుడు బోర్లా పడి ఉండగా పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ఎస్సై క్రిష్ణయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడిని యాచకుడిగా భావి స్తున్నట్లు ఎస్సై తెలిపారు. తీవ్ర అనారోగ్యం లేదా అతిగా మద్యం సేవించడం వల్ల మృతిచెంది ఉండవచ్చన్నారు. మృతదేహాన్ని ప్రైవేట్‌ అంబులెన్స్‌లో సూళ్లూరుపేట ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top