ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య | Two people killed by maoists | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య

Mar 30 2018 2:47 AM | Updated on Mar 30 2018 2:47 AM

Two people killed by maoists - Sakshi

చర్ల: పోలీసు ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరు యువకులను హతమార్చారు. గతంలో మావోయిస్టు పార్టీ లో పని చేసి జనజీవన స్రవంతిలో కలసిన ఈ ఇద్దరిని ఇన్‌ఫార్మర్లుగా అనుమానిస్తూ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో బుధవారం హతమార్చారు. వివరాలు.. భద్రాద్రి జిల్లా చర్ల మండలం పూసుగుప్ప గ్రామానికి చెందిన ఇర్పా లక్ష్మణ్‌ అలియాస్‌ భరత్‌ (30) నాలుగేళ్ల పాటు మావోయిస్టు పార్టీ లో దళ సభ్యుడిగా పని చేసి గత మే నెలలో లొంగిపోయాడు.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా చినఊట్లపల్లి గ్రామానికి చెందిన సోడి అందాల్‌ అలియాస్‌ నందా (20) కొంతకాలం మావోయిస్టు పార్టీలో పని చేసి గత జూన్‌లో లొంగిపోయి కూలీ పనులు చేసుకుంటున్నాడు. కాగా, ఇర్పా లక్ష్మణ్‌ కూరగాయలు అమ్ముకునేందుకు వెళ్లగా ఈనెల 24న మావోలు పట్టుకున్నారు. సోడీ అందాల్‌ను ఈనెల 18న కిడ్నాప్‌ చేశారు. వీరిద్దరినీ బుధవారం చినఊట్లపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజాకోర్టులో విచారించి హతమార్చారు. ఈ నెల 2న పూజారికాంకేర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు వీరే కారకులని, అందుకు వీరికి ఈ శిక్ష విధించామని భద్రాద్రి కొత్తగూడెం–తూర్పు గోదావరి (బీకే–ఈజీ) డివిజన్‌ కమిటీ పేరిట లేఖలు వదిలారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement