ఉపాధ్యాయురాలు దారుణ హత్య

Teacher Murdered In Tamil Nadu - Sakshi

చెన్నై , అన్నానగర్‌: నిశ్చితార్థం జరిగిన ఓ ఉపాధ్యాయురాలు దారుణ హత్యకు గురైంది.  ఈ విషాధకర సంఘటన తిరువిడైమరుదూర్‌ సమీపంలో గురువారం జరిగింది. తంజావూరు జిల్లా పాపనాశమ్‌–108 శివాలయ ప్రాంతానికి చెందిన కుమరవేల్‌. ఇతని కుమార్తె వసంతప్రియ (24). ఈమె కుంభకోణం లాల్‌బహుదూర్‌ శాస్త్రి రోడ్డులో ఉన్న ప్రైవేట్‌ మెట్రిక్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. గురువారం ఉమామహేశ్వరపురం కావేరి నది సమీపంలో వసంతప్రియ గొంతు కోసిన స్థితిలో హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలిస్‌ జాయింట్‌ సూపరింటెండెంట్‌లు రామచంద్రన్, సెంగమలకన్నన్, సీఐలు రాజేంద్రన్,  మణివేల్, మహాదేవన్‌ వీరు సంఘటన స్థలానికి వెళ్లి వసంతప్రియా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పోలీసుల విచారణలో హత్యకు గురైన వసంతప్రియాకు, వలంగైమాన్‌కు చెందిన వ్యక్తికి గత 28వ తేదీ వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం ఎప్పటిలాగే ఈమె పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం పాఠశాల ముగియగానే పాఠశాల నుంచి ఇంటికి బయలుదేరింది. కానీ ఆమె ఇంటికి వెళ్లలేదు. సంబంధం లేకుండా కావేరి నది సమీపంలో గొంతు కోసిన స్థితిలో హత్యకు గురై శవంగా పడి ఉంది. పోలీసుల విచారణలో వసంత ప్రియను ప్రేమించిన నందకుమార్‌ ఆమెను కావేరి తీరానికి తీసుకెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో నందకుమార్‌ ఆమెను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్టు విచరాణలో తెలసింది. పోలీసులు నందకుమార్‌ను గురువారం రాత్రి అరెస్టు చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top